ISRO: ఇస్రో జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. టెలికమ్యూనికేషన్‌లో మరింత మెరుగైన సేవలు!

  • ఈ తెల్లవారుజామున ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగం
  • 38 నిమిషాల్లోనే కక్ష్యలోకి
  • ఇన్‌శాట్ 4ఎ స్థానంలో సేవలు అందించనున్న జీశాట్-30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ తెల్లవారుజామున చేపట్టిన జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఇన్‌శాట్-4ఎ స్థానంలో సేవలు అందించేందుకు ఈ భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున 2:35 గంటలకు ఏరియన్-5 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగించిన 38 నిమిషాల్లోనే జీశాట్-30 ఉపగ్రహం కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో తెలిపింది. కమ్యూనికేషన్ ఉపగ్రహమైన దీని బరువు 3357 కిలోలు. దీని ద్వారా టెలికమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, టెలివిజన్‌కు సంబంధించి మరింత మెరుగైన సేవలు లభించనున్నాయి.

More Telugu News