దినేశ్ కార్తీక్‌కు కూడా దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్

17-01-2020 Fri 07:59
  • ధోనీతోపాటు దినేశ్ కార్తీక్ కాంట్రాక్ట్ కూడా రద్దు
  • ధోనీ వార్త చర్చనీయాంశం కావడంతో మరుగున పడిన కార్తీక్ విషయం
  • పంత్, సాహాలకు దక్కడంతో కార్తీక్‌ కు దక్కని కాంట్రాక్ట్

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు కూడా బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితాలో ధోనీ పేరు లేకపోవడంతో అందరూ షాకయ్యారు. ధోనీ కాంట్రాక్ట్ రద్దయిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. అయితే, ధోనీనే కాదు.. మరో క్రికెటర్ దినేశ్ కార్తీక్ కాంట్రాక్ట్ కూడా రద్దయినా ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాలేదు. టీమిండియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో ఇద్దరు వికెట్ కీపర్లకు మాత్రమే చోటు ఉంటుంది. రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహాలకు కాంట్రాక్ట్ పునరుద్ధరించడంతో దినేశ్ కార్తీక్‌కు అవకాశం లభించలేదు.