Sensex: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

  • 60 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నిన్న నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 42వేల మార్క్ ను దాటింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు కొంతమేర ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 41,933కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 12,356 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (3.23%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.38%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.36%), భారతి ఎయిర్ టెల్ (1.34%), టీసీఎస్ (0.69%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.94%), హీరో మోటో కార్ప్ (-1.70%), టాటా స్టీల్ (-1.54%), టెక్ మహీంద్రా (-1.48%), యాక్సిస్ బ్యాంక్ (-1.19%).

More Telugu News