కాకినాడ వైసీపీ ఎమ్మెల్యేకి నందమూరి రామకృష్ణ వార్నింగ్ 

16-01-2020 Thu 15:16
  • ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి హెచ్చరిక
  • చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోబోం
  • నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బావ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. తాము గాజులు తొడుక్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము నోరు తెలిస్తే మీ జాతకాలు బయటపడతాయని హెచ్చరించారు. తమ బావను విమర్శిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.