Viral Videos: చేప నోట్లో ఆహారం వేసి ఆకలి తీర్చిన బాతు.. అబ్బుర పరుస్తోన్న వీడియో

  • ఆహారం కోసం వెతికిన నీటిలోని చేప 
  • ట్రేలోంచి ధాన్యాలను నోటితో తీసిచ్చిన బాతు 
  • స్నేహానికి మంచి ఉదాహరణ అంటోన్న నెటిజన్లు

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కశ్వాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ చేపకు బాతు ఆహారం అందించింది. నీటిలోని చేప ఆహారం కోసం వెతుకుతోన్న సమయంలో అక్కడే ఉన్న ఓ బాతు ట్రేలోంచి ధాన్యాలను నోటితో తీసి చేపకు అందించింది. స్నేహానికి ఇంత కంటే మంచి ఉదాహరణ ఉంటే చూపించండంటూ  ప్రవీణ్‌ కశ్వాన్‌ పేర్కొన్నారు.

బాతు ధాన్యాన్ని అందిస్తుండగా చేప నోరు తెరుస్తోంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. బాతు, చేపలను స్నేహితులుగా పేర్కొంటూ ఆ స్నేహంలోని మాధుర్యం అలాంటిదని అంటున్నారు. మనుషుల్లాగే ఇతర జంతువులకు ఆహారాన్ని అందించిన బాతు గుణం అబ్బుర పరుస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని ఓ పార్కులో ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. 

More Telugu News