Ntr: 'ఆర్ ఆర్ ఆర్' క్లైమాక్స్ ఖర్చు 150 కోట్లు!

  • 'ఆర్ ఆర్ ఆర్' కోసం 450 కోట్ల ఖర్చు
  • కీలకమైన పాత్రలో అజయ్ దేవగణ్ 
  • జూలై 30వ తేదీన విడుదల 

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ .. చరణ్ తదితరులపై భారీస్థాయిలో క్లైమాక్స్ ను డిజైన్ చేశారట.

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో వుంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ జోడీగా అలియా భట్ .. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, జులై 30వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News