CPI Narayana: రాజధానిపై అసెంబ్లీలో చేయబోయే తీర్మానానికి విలువ లేదు: సీపీఐ నారాయణ

  • అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతాం
  • రాజధానిపై మోదీకి డి.రాజా లేఖ రాస్తారు
  • అమరావతి అంశంపై రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం చేయబోయే తీర్మానానికి విలువలేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతామని చెప్పారు. అమరావతి రాజధానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా లేఖ రాస్తారని తెలిపారు. రాజధాని అంశంపై రాజీనామా చేసి ముఖ్యమంత్రి జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాలు విసిరారు.

రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తే అమరావతి కంటే ఎక్కువ వ్యయమవుతుందని నారాయణ తెలిపారు. ఉద్యోగులకు రాయితీలు, ఇతర ఖర్చులతో సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. అదే డబ్బుతో అమరావతిలోనే గొప్ప రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని ఆయన అన్నారు.

More Telugu News