Allu Arjun: కొత్త చిత్రం కోసం వచ్చేనెల నుంచి సెట్స్ పైకి బన్నీ

  • సంక్రాంతికి హిట్ కొట్టిన బన్నీ 
  • తన 20వ సినిమా సుకుమార్ తో 
  • బన్నీ జోడీగా తొలిసారిగా రష్మిక

'అల వైకుంఠపురములో' సినిమాతో ఈ ఏడాది ఆరంభంలోనే అల్లు అర్జున్ హిట్ కొట్టేశాడు. సంక్రాంతి కానుకగా ఆయనకి ఈ సక్సెస్ లభించడం పట్ల అభిమానులంతా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డుల దిశగా పరుగులు తీస్తుండగా, బన్నీ ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు తన తదుపరి సినిమా కోసం మరింత ఉత్సాహంగా సిద్ధమవుతున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తదుపరి సినిమా వుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ ను కేరళలో పూర్తి చేశారు. బన్నీ కాంబినేషన్లో లేని సన్నివేశాలను ఇతర ఆర్టిస్టులపై చిత్రీకరించారు. వచ్చేనెల మొదటివారం నుంచి తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో బన్నీ పాల్గొననున్నాడట. బన్నీకి ఇది 20వ సినిమా కావడం ఒక విశేషమైతే, తొలిసారిగా రష్మిక ఆయన జోడీ కడుతుండటం మరో విశేషం.

More Telugu News