UNO: ఐరాసలో కశ్మీర్ అంశాన్ని చర్చించాలన్న చైనా.. సభ్యదేశాల తిరస్కరణ!

  • ఐరాస రహస్య సమావేశం
  • కశ్మీర్ అంశాన్ని జాబితాలో చేర్చాలన్న చైనా
  • కుదరదన్న సభ్య దేశాలు

ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నంలో  పాకిస్థాన్ మరోమారు భంగపాటుకు గురైంది. ఓ ఆఫ్రికన్ దేశానికి చెందిన అంశంపై చర్చించేందుకు నిన్న ఐరాస భద్రతా మండలి రహస్య సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన రహస్య ఇతర అంశాల జాబితాలో కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని పాక్ మిత్రదేశం చైనా కోరింది. అయితే, ఇతర దేశాలు ఇందుకు అంగీకరించలేదు. అది భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని భద్రతా మండలి తేల్చి చెప్పడంతో చైనాకు భంగపాటు తప్పలేదు.

ఈ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నించిన పాక్ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. కుట్రలను పక్కనపెట్టి ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పాక్ చేస్తున్నవి నిరాధార ఆరోపణలని మరోమారు తేలిపోయిందన్నారు. సభను తప్పుదోవ పట్టించాలన్న పాక్ బుద్ధిని సభ్యదేశాలు ముందే గ్రహించి తిరస్కరించాయని పేర్కొన్నారు.

More Telugu News