Pakistan: పీవోకేను అతలాకుతలం చేసిన మంచు తుపాను

  • నీలం లోయలో మంచు విలయం
  • 60 మంది మృతి
  • ఆఫ్ఘనిస్థాన్ పైనా ప్రభావం

ఆసియా దేశాలపై మంచు తుపానులు భీకరంగా పంజా విసురుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ లోని నీలం లోయలో మంచు తుపాను విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఈ తుపాను ధాటికి పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో 60 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. అటు ఆఫ్ఘనిస్థాన్ లోనూ మంచు తుపాను ప్రభావం కనిపించింది. ఆఫ్ఘనిస్థాన్ లో 15 మంది మృత్యువాత పడ్డారు. కాగా, జమ్మూకశ్మీర్ లోనూ మంచు విలయం సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించడం తెలిసిందే.

More Telugu News