Andhra Pradesh: సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీ రాజధానిపై కన్నా వ్యాఖ్యలు
  • రాజధాని మార్పు రాష్ట్రానికి మంచిదికాదన్న కన్నా
  • జగన్ తన ఉన్మాదానికి రాష్ట్రాన్ని బలిచేస్తున్నారని విమర్శలు

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం మారితే రాజధాని కూడా మార్చడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదని అన్నారు. ప్రధాన వాటాదారు అయిన కేంద్రాన్ని సంప్రదించకుండా రాజధాని విషయంలో జగన్ నియంతృత్వ ధోరణితో ముందుకెళుతున్నారని విమర్శించారు. భూతల స్వర్గాన్ని చూపిస్తానన్న జగన్ ఇప్పుడు నరకం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని కన్నా ఉద్ఘాటించారు. రాజధాని కట్టడం చేతకాకపోతే వదిలేయాలని, తాము నిర్మించి చూపిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానిది పోలీస్ పాలన అయితే, ఈ ప్రభుత్వానిది రాక్షస పాలన అని అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో ఫ్యాక్షనిజం తప్ప ప్రజాస్వామ్యం కనిపించడంలేదని అన్నారు. జగన్ తన ఉన్మాదానికి రాష్ట్రాన్ని బలిచేస్తున్నారని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పి చేస్తోందనేది అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News