Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తజనం

  • సంక్రాంతి సందర్భంగా మకరజ్యోతి దర్శనం
  • హాజరైన లక్షల మంది భక్తులు
  • అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిమల
  • జనవరి 21తో ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల కొండలు అయ్యప్పనామ స్మరణతో మార్మోగిపోయాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహించే మకరజ్యోతి దర్శనం క్రతువు అత్యంత ఘనంగా జరిగింది. శబరిమలలోని పొన్నాంబలమేడు పర్వతంపై మకరజ్యోతి కనిపించడంతో భక్తులు తరించిపోయారు. సరిగ్గా 6 గంటల 51 నిమిషాలకు జ్యోతి దర్శనమిచ్చింది.

మకరజ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో శబరిమల ప్రాంతం కిటకిటలాడింది. లక్షల మంది భక్తులు భక్తిభావం ఉప్పొంగుతుండగా అయ్యప్ప నామస్మరణ చేస్తూ కనులారా దివ్యజ్యోతిని వీక్షించారు. కాగా, మకరజ్యోతి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఐదు లక్షల మంది భక్తులు వెళ్లినట్టు అంచనా! జనవరి 21న స్వామి వారి ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు వెల్లడించింది.

More Telugu News