Andhra Pradesh: కేసీఆర్, జగన్ భేటీపై నాగం విసుర్లు

  • హైదరాబాదులో సమావేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు
  • స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి
  • కేసీఆర్ పై ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ హైదరాబాదులో సుదీర్ఘ సమయం పాటు భేటీ కావడంపై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. సీఎంల భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై నాగం అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం అధికంగా తెలంగాణలోనే ఉందని, అలాంటప్పుడు ఏపీకి అధిక కేటాయింపులు, తెలంగాణకు తక్కువ కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిపుచ్చుకోవడానికి ఇదేమీ వాళ్లిద్దరి సొంతంటి వ్యవహారం కాదని అన్నారు.

నదుల అనుసంధానం అంటూ కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు స్వీకరించేందుకు కేసీఆర్ ద్రోహానికి పాల్పడుతున్నారని నాగం ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు కోసం ఏపీ సర్కారు రూ.23 వేల కోట్లు కేటాయిస్తోందని, ఈ పరిణామంతో తెలంగాణ ఎడారిగా మారిపోవడం తథ్యమని హెచ్చరించారు. నీటి పంపకాల విషయంలో కనీస అవగాహన లేని కేసీఆర్ చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News