Talasani: కోడిపందాలను జూదంగా చూడొద్దు: తలసాని

  • పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో కోడిపందాలు
  • కోడిపందాలను వీక్షించిన తెలంగాణ మంత్రి
  • సంప్రదాయ క్రీడలుగా పేర్కొన్న తలసాని

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలను తిలకించారు. జిల్లాలోని ఉండి మండలంలో ఏర్పాటు చేసిన కోడిపందాలకు తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని కోడిపందాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. కోడిపందాలు ఎంతో కాలంగా ఓ ఆనవాయితీగా వస్తున్నాయని, అందుకే వీటిని ఎవరూ జూదంగా చూడరాదని తెలిపారు. కోడిపందాలు తెలుగు సంప్రదాయ క్రీడల్లో భాగమని, ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని అన్నారు. ఈ సందర్భంగా తలసాని పందెం పుంజులను చేతిలోకి తీసుకుని ఆనందించారు.

More Telugu News