Jammu And Kashmir: జమ్ము ప్రజలకు ఊరట.. నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి

  • కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పునరుద్ధరణ
  • కొన్ని ప్రాంతాలకే పరిమితం
  • 2జీ సేవలు మాత్రమే అందుబాటులోకి

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 చట్టం రద్దు, రాష్ట్ర విభజన అనంతరం అక్కడ నిలిచిపోయిన ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం పాక్షికంగా పునరుద్ధరించింది. పలు అత్యవసర సేవలకు ఇంటర్నెట్‌ తప్పనిసరని, నెట్‌ సేవలపై నిషేధం విషయంలో పునరాలోచన చేయాలంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగింది. జమ్మూలోని ఆసుపత్రులు, హోటళ్లు, రవాణా కేంద్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని బ్రాడ్‌బాండ్‌, 2జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జమ్ము, సాంబా, కతువా, ఉదంపూర్‌, రియాసి జిల్లాల్లో అధికారిక వెబ్‌సైట్లకు అనుమతిస్తూ సేవలు ప్రారంభించారు.

More Telugu News