Traffic police: కొడుకు డ్రైవింగ్‌ ముచ్చట తీరిస్తే...జేబుకు చిల్లు పడింది!

  • మైనర్‌కు బండి ఇచ్చినందుకు భారీగా జరిమానా
  • రూ.26 వేలు కట్టించిన ట్రాఫిక్‌ పోలీసులు
  • ఒడిశా రాష్ట్రంలో ఘటన

‘నాన్నా బండి నడుపుతా’ అంటూ ఆ కొడుకు ముచ్చటపడ్డాడు. 'సరే.. కానీ నాన్నా' అంటూ ఆ మైనర్‌ బాలుడికి తండ్రి అవకాశం ఇచ్చాడు. మధ్యలో ట్రాఫిక్‌ పోలీసులు ఎంటరై జేబుకు చిల్లుపడితే తప్ప తానెంత తప్పుచేసిందీ ఆ తండ్రికి తెలిసిరాలేదు.

వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం అంగూల్‌ జిల్లాలోని పలాహడ పట్టణానికి చెందిన ఓ మైనర్‌ బాలుడు బండి నడుపుతూ వస్తుండగా పోలీసులు గమనించారు. అడ్డుకుని లైసెన్స్‌ అడిగారు. తాను మైనర్‌నని లైసెన్స్‌ ఇవ్వలేదని సదరు బాలుడు తెలిపాడు. మరి బండెక్కడిదని ప్రశ్నిస్తే ఈ బండి తన తండ్రిదని, ముచ్చటపడి బయటకు తీశానని తెలిపాడు. దీంతో మైనర్‌ కొడుక్కి నిర్లక్ష్యంగా బండి ఇచ్చినందుకు తండ్రికి రూ.26 వేలు జరిమానా విధించారు. కొన్నిరోజుల క్రితం కటక్‌ పోలీసులు ఇలాంటి జరిమానే విధించారు.

More Telugu News