jallikattu: జోరుగా జల్లికట్టు.. ఎద్దులు గుద్దితే ఎగిరిపడ్డ యువకులు.. ఫొటోలు ఇవిగో

  • తమిళనాడులోని మధురై జిల్లాలో ప్రారంభమైన జల్లికట్టు
  • సంక్రాంతికి ఆనవాయతీగా ఏటా జల్లికట్టు పోటీలు
  • గాయపడే వారి కోసం అంబులెన్సులు సిద్ధం

సంక్రాంతిని పురస్కరించుకుని తమిళనాడులో ఏటా నిర్వహించే జల్లికట్టు పోటీలు ఈ ఏడాది కూడా జోరుగా కొనసాగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆ రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఈ రోజు ఉదయం  జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి.                    అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే, పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గాయపడే వారి కోసం నిర్వాహకులు అంబులెన్సులు సిద్ధం చేశారు.
           

More Telugu News