Talasani: భీమవరంలో సంక్రాంతి సంబరాలలో మంత్రి తలసాని

  • ఘన స్వాగతం పలికిన అభిమానులు 
  • అమాత్యునికి తులాభారం 
  • పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే తదితరులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భీమవరం వచ్చారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గత ఏడాది కూడా మంత్రి ఇక్కడి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆనవాయితీగా ఈ ఏడాది కూడా వచ్చారు. తలసానికి స్థానిక నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సత్కరించి తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, స్థానిక నాయకుడు పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News