Tirumala: తిరుమలలో మారిన గదుల బుకింగ్ విధానం... కొత్త నిబంధనలివే!

  • ఎంత గది తీసుకుంటే, అంత మొత్తంలో డిపాజిట్
  • ఖాళీ చేసిన తరువాత రిఫండ్
  • తక్షణం ఆన్ లైన్ భక్తులకు, నెలాఖరు నుంచి ఆఫ్ లైన్ భక్తులకు అమలు

తిరుమలలో అద్దె గదుల బుకింగ్ విధానంలో మార్పులను చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 'క్యాష్ ఆన్ డిపాజిట్' విధానం అమలు చేయనున్నామని, ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ మాధ్యమంలో రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తరువాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.

ఆఫ్ లైన్ లో... అంటే, తిరుమలకు వచ్చి, అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్ నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానం అమలైంది. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయమై టీటీడీ వివరణ ఇవ్వలేదు.

More Telugu News