Pawan Kalyan: ఏ ఆశయాలతో మోదీ ముందుకు వెళ్తున్నారో అవి ఏపీలో కనిపించడం లేదు: పవన్ కల్యాణ్

  • ప్రజా కష్టాలు, రాజధాని రైతు సమస్యలు కేంద్రానికి వివరించా
  • ఇలాంటి పరిస్థితులు రాష్ట్రానికి మంచివి కావని చెప్పాను
  • అందరూ కలిసి సమష్టి నిర్ణయం తీసుకోవాలని కోరాను

రాష్ట్రంలో ప్రజల కష్టాలు, రాజధాని రైతుల సమస్యలు, మహిళలపై పోలీసుల దాడులు, ఏపీలో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం తదితర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, తన ఢిల్లీ పర్యటన ముఖ్యఉద్దేశం అదేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

కాకినాడలో గాయపడ్డ తమ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి తెలియజేస్తూనే ఉన్నామని, అక్కడి నుంచి పిలుపు రాగానే తాను ఢిల్లీ వెళ్లి వివరించి చెప్పానని అన్నారు.

ఇలాంటి  పరిస్థితులు రాష్ట్రానికి మంచివి కావని, అందరూ కలిసి సమష్టి నిర్ణయం ఒకటి తీసుకోవాలని, ఏ ఆశయాలతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారో అవి ఏపీలో కనిపించడం లేదన్న విషయాన్ని వారికి చెప్పానని అన్నారు. తాను ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కాకినాడలో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన ఒకే చోట ఉండాలని, ఏపీ అభివృద్ధి కావాలని అన్నారు. రాజధానిని మార్చాలని కోరుకున్నది విశాఖ ప్రజలు కాదని, వైసీపీ నేతలని పవన్ కల్యాణ్ విమర్శించారు.

More Telugu News