China: రోడ్డుపై వెళుతున్న బస్సు భూమిలో కుంగిపోయింది... వీడియో ఇదిగో!

  • చైనాలో ఘోరం
  • రోడ్డుపై సింక్ హోల్
  • ఆరుగురి మృతి

చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సు ఉన్నట్టుండి భూమిలో కుంగిపోయింది. ఈ ఘటన చూస్తున్న పాదచారులు సైతం ఆ గుంతలో పడిపోయారు. చైనాలోని కింగాయ్ ప్రావిన్స్ లో క్సినింగ్ నగరంలో ఈ ఘటన జరిగింది.

నగరంలోని ట్రాఫిక్ లో నిదానంగా వెళుతున్న బస్సు ఓ స్టాప్ వద్ద ఆగింది. అయితే, అకస్మాత్తుగా అక్కడి భూమి కుంగిపోయింది. రాకాసి నోరులా తెరుచుకున్న ఆ సింక్ హోల్ లోకి బస్సు క్రమంగా జారిపోయింది. ఈ సందర్భంగా బస్సు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూలి అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఈ ఘటన చూస్తున్న కొందరు పాదచారులు సైతం కాళ్ల కింద భూమి కుంగిపోవడంతో గుంతలో పడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పదిమంది గల్లంతయ్యారు. మరో 16 మంది క్షతగాత్రులు కాగా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News