India: వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా

  • ముంబయి వాంఖడే మైదానంలో మ్యాచ్
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఆసీస్
  • 30 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. 35 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ (10) సొంతగడ్డపై నిరాశపర్చినా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (74), వన్ డౌన్ ఆటగాడు కేఎల్ రాహుల్ (47) రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు.

 అయితే ఆసీస్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రదర్శన చేయడంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 30 పరుగుల తేడాతో 4 వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ కోహ్లీ 16 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ (4) సైతం ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు.

More Telugu News