Delhi: జేఎన్ యూ దాడి కేసులో... వాట్సాప్ గ్రూప్ లకు సమన్ల జారీ

  • జాబితాలో ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్’, ‘యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్’ 
  •  హైకోర్టు ఆదేశాల మేరకు 91మందికి సమన్లు  
  • మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశాలు  

ఇటీవల ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ) లో విద్యార్థులపై దుండగుల దాడికి సంబంధించిన కేసులో రెండు వాట్సాప్ గ్రూపుల సభ్యులకు కోర్టు సమన్లు జారీ అయ్యాయి. ఈ దాడులకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విద్యార్థులు, అధ్యాపకులపై ముందస్తు వ్యూహం ప్రకారం దాడి చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆందోళనకారులను కూడగట్టేందుకు రెండు వాట్సాప్ గ్రూప్ లు పనిచేశాయని వారు కోర్టుకు తెలిపారు. ఇందులో ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్’, ‘యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్’ వాట్సాప్ గ్రూపులున్నాయన్నారు.

వాట్సాప్, గూగుల్, ఫేస్ బుక్, యాపిల్ సంస్థలు ఐఎన్ సీలు ఈ మెయిల్ తో సహా, తమ సబ్ స్క్రైబర్ల సమాచారాన్ని భద్రపర్చడానికి ఆదేశాలు జారీచేయాలంటూ జేఎన్ యూ ప్రొఫెసర్లు విచారణ సందర్భంగా కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. రెండు గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న 91మందికి సమన్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

అంతేకాక, సదరు రెండు గ్రూపుల్లోని 91మంది మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కంపెనీ విధానాలకనుగుణంగా వాట్సాప్, గూగుల్ సంస్థలు సబ్ స్క్రైబర్ల డేటాను భద్రపరచాలని కూడా హైకోర్టు ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ పోలీసులకు అందించాలని యూనివర్సిటీ అధికారులకు సూచించింది.

More Telugu News