Jagan: రాజధాని భూములపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయనున్నారు: స్పష్టం చేసిన రోజా

  • రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం
  • అందుకే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు
  • రాజధానిని మార్చుతామని సీఎం జగన్‌ ఎప్పుడూ చెప్పలేదు
  • అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఏర్పడతాయన్నారు 

అమరావతి రాజధానిపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నారాయణ ధర్నాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని నిజమైన రైతులు గమనించాలని వ్యాఖ్యానించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయనున్నారని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆమె చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టిందని ఆమె నిలదీశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు జోలె పట్టాల్సిందని ఆమె అన్నారు. ఏపీని చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని ఆమె అన్నారు. ఆ డబ్బు లోకేశ్ తిన్నాడా? అని ప్రశ్నించారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్‌ ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు. అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఏర్పడతాయని ఆయన తెలిపారని చెప్పుకొచ్చారు.

More Telugu News