USA: అమెరికా బలగాలను తరిమికొడదాం.. మాతో చేతులు కలపండి: ఇరాన్

  • అమెరికా బలగాలు ఉన్నంత వరకు ఇక్కడ శాంతి ఉండదు
  • ఇరాక్, సిరియాలు అస్థిరత్వానికి గురయ్యాయి
  • యూఎస్ బలగాలను వెళ్లగొట్టడమే సరైన ప్రతీకారం

మధ్యప్రాచ్య ప్రాంతం (మిడిల్ ఈస్ట్) నుంచి అమెరికా బలగాలను తరమికొడదామని ఇరాన్ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో అమెరికా టెర్రరిస్టు బలగాలు (సైన్యం) ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో శాంతి, రక్షణ ఉండవని తెలిపింది. అమెరికా బలగాలను తరిమికొట్టేందుకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు తమతో చేతులు కలపాలని కోరింది. అన్ని దేశాలు ఒకటైతేనే అమెరికా బలగాలను వెళ్లగొట్టగలమని చెప్పారు.  

ఇరాన్ జాతీయ భద్రతా విభాగం సెక్రటరీ అలీ షంఖానీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇరాక్, సిరియా దేశాలు అమెరికా వల్ల అస్థిరత్వానికి గురయ్యాయని ఆయన విమర్శించారు. అమెరికా బలగాలను వెళ్లగొట్టడం ఒక్కటే సరైన ప్రతీకారచర్య అని అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

More Telugu News