MLA: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం

  • నిర్మల్ జిల్లా భైంసాలో మత పరమైన అల్లర్లు
  • చలో భైంసాకు పిలుపు నిచ్చిన ఎమ్మెల్యే
  • రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధానికి గురయ్యారు. నిర్మల్ జిల్లా భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన రాజాసింగ్ చలో భైంసాకు పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనను ఇల్లు విడిచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాత్రి నుంచే రాజాసింగ్ ఇంటి వద్ద బందోబస్తును పెంచారు.

భైంసా అల్లర్ల సందర్భంగా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు సైతం గాయాలయ్యాయి. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి రెండు బెటాలియన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బంది నిర్మల్ జిల్లాకు చేరుకున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. భైంసాలో కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించారు.

More Telugu News