Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ ర్యాలీకి అనుమతి నిరాకరణ.. 'అతిక్రమిస్తే చర్యలే' అంటున్న జిల్లా ఎస్పీ!

  • ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద ఘర్షణ
  • గాయపడిన జనసేన కార్యకర్తలకు నేడు పవన్ పరామర్శ
  • ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్న ఎస్పీ

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంటి వద్ద జరిగిన ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు నేడు నగరానికి రానున్న పవన్ కల్యాణ్, భారీ ర్యాలీని తలపెట్టి, అందుకు అనుమతించాల్సిందిగా పోలీసులను కోరారు. అయితే, పోలీసులు ఈ ర్యాలీకి అనుమతించలేదు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, అందుకు విరుద్ధంగా ఏవైనా కార్యక్రమాలు చేపడితే, చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ నయీమ్ అస్మీ హెచ్చరించారు.

పవన్ ర్యాలీలు, సభలు లేకుండా నగరానికి రావచ్చని, తన పార్టీ కార్యకర్తలను పరామర్శించవచ్చని అన్నారు. అందుకు విరుద్ధంగా బహిరంగ ప్రదర్శన నిర్వహిస్తే మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా, నిన్నటి వరకూ న్యూఢిల్లీలో ఉన్న పవన్, ఈ ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు వచ్చి, గాయపడిన వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News