Deepika Padukone: దీపిక వీటి గురించి తెలుసుకోవాలి: బాబా రాందేవ్

  • నటనలో దీపిక ప్రతిభావంతురాలు
  • సామాజిక, రాజకీయ అంశాలపై ఆమె మరింత తెలుసుకోవాలి
  • అందుకే నాలాంటి సలహాదారుడిని నియమించుకోవాలి

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిరసనలు చేపట్టిన విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపిక పదుకునే సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీకి వెళ్లిన ఆమె విద్యర్థుల మధ్య కాసేపు గడిపింది. ఈ నేపథ్యంలో, పలువురి నుంచి ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

 ఈ క్రమంలో యోగా గురు బాబా రాందేవ్ స్పందిస్తూ, నటన విషయంలో దీపిక చాలా ప్రతిభావంతురాలని ఆయన కితాబిచ్చారు. అయితే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో పాటు దేశం గురించి ఆమె మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తనలాంటి ఓ సలహాదారుడిని నియమించుకోవాలని సలహా ఇచ్చారు. తనలాంటి వ్యక్తుల సలహాలు స్వీకరిస్తే ఆమె సరైన వ్యాఖ్యలు చేయగలుగుతారని అన్నారు.

More Telugu News