Online: ఫేస్ బుక్ లో పరిచయమై గుంటూరు యువకుడిని దారుణంగా మోసం చేసిన విదేశీ యువతి!

  • 'స్పందన'కు వచ్చి యువకుడి ఫిర్యాదు
  • బహుమతి పంపుతున్నానంటే నమ్మిన కృష్ణదాసు
  • పన్నుల రూపంలో రూ. 3.30 లక్షల చెల్లింపు

సామాజిక మాధ్యమాల్లో ఏర్పడే పరిచయాలు ఎంతటి అనర్ధాలకు దారితీస్తాయో తెలియజేసే మరో ఉదంతమిది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు, తనకు జరిగిన నష్టాన్ని 'స్పందన'లో తెలియజేశాడు. వివరాల్లోకి వెళితే, కృష్ణదాసు అనే యువకుడికి ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయం అయింది. తనతో ఆమె తరచూ చాటింగ్ చేసేదని, కొన్ని రోజుల క్రితం ఓ బహుమతిని పంపుతున్నానని ఆమె చెప్పగా, నమ్మానని తెలిపాడు.

ఆపై ఓ అపరిచిత వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. మీ పేరిట గిఫ్ట్ వచ్చిందని, చెప్పాడు. ఆ బహుమతికి పన్ను రూపంలో రూ. 30 వేలు కట్టాలని చెబితే, అపరిచితుడు చెప్పిన ఖాతాకు ఆ డబ్బు ఆన్ లైన్ మాధ్యమంగా పంపాడు. మరుసటి రోజున ఇంకో వ్యక్తి ఫోన్ చేసి, బహుమతి చాలా విలువైనదని, ఇంకో రూ. 3 లక్షలు కట్టాలని చెప్పడంతో, ఆ డబ్బు కూడా కట్టాడు. ఆపై వారికి ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో, తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News