JMI: విద్యార్థులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు.. వారిపై కేసు పెడతాం: ఏఎంఐ వైస్ చాన్స్‌లర్

  • సీఏఏకు వ్యతిరేకంగా జేఎంఐ విద్యార్థుల ఆందోళన
  • విద్యార్థులపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారని వీసీ మండిపాటు
  • పోలీసులపై కేసుకు కోర్టును ఆశ్రయిస్తామన్న నజ్మా అఖ్తర్

జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారని జేఎంఐ వైస్ చాన్స్‌లర్ నజ్మా అఖ్తర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జేఎంఐ విద్యార్థులు గత నెలలో ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనపై ఉక్కుపాదం మోపారు. ఈ ఘటనపై తాజాగా వీసీ స్పందించారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారని, వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

More Telugu News