Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పూజ హెగ్డేకు ఐదు వరుస హిట్లు 
  • విశాఖలో బన్నీ గ్రాండ్ సక్సెస్ మీట్ 
  • మల్టీ స్టారర్ లో రానా దగ్గుబాటి

 *  తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటూ టాప్ స్టార్ గా రాణిస్తున్న కథానాయిక పూజ హెగ్డే 'అల వైకుంఠపురములో' చిత్రంతో వరుసగా ఐదు హిట్లు పొందిన ఘనత దక్కించుకుంది. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేశ్, హౌస్ ఫుల్ 4 (హిందీ) చిత్రాలతో పాటు ఇప్పుడు 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఐదు వరుస హిట్లు ఆమె ఖాతాలో పడ్డాయి. 
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ ను ఈ నెల 18న విశాఖపట్నంలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.  
*  ప్రస్తుతం తెలుగులో 'విరాటపర్వం', హిందీలో 'హాథీ మేరే సాథీ' చిత్రాలలో నటిస్తున్న రానా దగ్గుబాటి తాజాగా మరో హిందీ చిత్రాన్ని అంగీకరించాడు. అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించే మల్టీ స్టారర్ లో రానా కూడా ఓ హీరోగా నటిస్తాడట.

More Telugu News