Andhra Pradesh: కేసీఆర్ ఏకాంత సేవలో జగన్ తరించిపోతున్నాడు: ఉమ విమర్శలు

  • సీఎం కేసీఆర్ తో ముఖ్యమంత్రి జగన్ సమావేశం
  • ఘాటుగా స్పందించిన దేవినేని ఉమ
  • కేసీఆర్ తో చర్చల ద్వారా రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అని నిలదీసిన ఉమ

ఏపీ సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కావడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఏకాంత సేవలో జగన్ తరించిపోతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆరు సార్లు కేసీఆర్ తో భేటీ అయిన వైఎస్ జగన్ సెక్షన్ 9, సెక్షన్ 10 ఆస్తుల గురించి కానీ, పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసులను ఎత్తివేసే విషయం గురించి కానీ, కేసీఆర్ తో చర్చల ద్వారా రాష్ట్రానికి ఏ ప్రయోజనం చేకూర్చారో ఆయన చెప్పాలని ట్వీట్ చేశారు.

పాము తన పిల్లల్లి తానే చంపుకుని తినేలా సీఎం జగన్ మన రాష్ట్ర ప్రయోజనాలను చంపి పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడని మండిపడ్డారు. తమకు ఇవ్వాల్సిన రూ.1200 కోట్లు నాలుగు నెలల్లోనే ఎలా ఇచ్చాడో అర్థంకాక పక్క రాష్ట్ర నాయకులు మన సీఎం దోపిడీ గురించి విస్మయానికి గురవుతున్నారని ఉమ వ్యాఖ్యానించారు.

More Telugu News