Stock Markets: ఫిబ్రవరి ఒకటిన స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి!: బీఎస్ఈ అధికార ప్రతినిధి

  • శనివారం సెలవైనప్పటికీ.. మార్కెట్లు పనిచేస్తాయి 
  • అదేరోజు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ సమర్పణ
  • బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లు పనిచేస్తాయి

ఈ సారి ఫిబ్రవరి 1న శనివారం కూడా స్టాక్ మార్కెట్లు తెరిచేవుంటాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అదేరోజు పార్లమెంట్ లో 2020-21ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెడుతోంది. బాంబే స్టాక్ ఎక్చేంజీ(బీఎస్ఈ), అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్ఎస్ఈ) కూడా ఆ రోజు పనిచేయనున్నాయని సమాచారం.

ఈ మేరకు వివరాలను బీఎస్ఈ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమర్పించనుండటంతో ఆ రోజు(శనివారం) సెలవు దినమైనప్పటికీ స్టాక్ మార్కెట్లను తెరిచి వుంచేందుకు నిర్ణయించామని ఆయన చెప్పారు. కేంద్రంలో రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్పిస్తున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్ ఇది. ఇదే విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక లైవ్ మింట్ కూడా పేర్కొంది.

More Telugu News