Perni Nani: రాజధాని రైతులు తమ సమస్యలపై నేరుగా సీఆర్డీఏ కమిషనర్ ను కలవొచ్చు: మంత్రి పేర్ని నాని

  • ఈ నెల 15వ తేదీ 5 గంటలలోగా సీఆర్డీఏ కమిషనర్ ను కలవండి
  • లేనిపక్షంలో ఈ-మెయిల్ చేయండి
  • నిజమైన రైతులకు మేము చెప్పేది అర్థమైంది

జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ మరోమారు ఈ రోజు చర్చించింది. అనంతరం, మీడియాకు మంత్రి పేర్ని నాని ఈ సమావేశం వివరాలను వివరించారు. ఈ నెల 17న మరోమారు చర్చించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.

ఈ నెల 15వ తేదీ ఐదు గంటల లోగా సీఆర్డీఏ కమిషనర్ ను వ్యక్తిగతంగా కలవాలని, లేనిపక్షంలో కమిషనర్ ఈ- మెయిల్ ఐడీకి రైతులు తమ సందేహాలను పంపాలని సూచించారు. నిజమైన రైతులకు తాము చెప్పేది అర్థమైందని, మంత్రులను రైతులు కలుస్తున్నారని, వారితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఓ పథకం ప్రకారం పోలీసులను రెచ్చగొట్టే విధంగా, కెమెరాల ముందు సానుభూతి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News