Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ 259 పాయింట్ల పెరుగుదల 
  • నిఫ్టీ 72 పాయింట్లు అప్
  • డాలరుతో పోలిస్తే.. రూపాయి విలువ 70.79

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో దేశంలో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఉదయం  భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించిన దేశీయ మార్కెట్లు సాయంత్రం వరకు అదే జోరును కొనసాగించాయి. చివరికి బీఎస్ఈ సెన్సెక్స్‌ 259 పాయింట్లు ఎగిసి 41,859 వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 12,329 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. బ్యాంకింగ్‌, ఐటీ సెక్టార్ల లాభాలు మార్కెట్‌కు మద్దతునిచ్చాయి.

త్రైమాసిక ఫలితాలతో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ షేరు ధర సుమారుగా 4 శాతానికి పైగా పెరిగింది. అటు జాతీయ స్టాక్ ఎక్చేంజీలో కూడా ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, గెయిల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాలను నమోదు చేసుకున్నాయి. యస్ బ్యాంకు, యూపీఎల్, భారతీ ఇన్ ఫ్రా టెల్, టాటా కన్సల్టెన్సీ, ఐషర్ మోటార్స్ షేర్ల ధరలు క్షీణించాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.79 వద్ద కొనసాగుతోంది.

More Telugu News