Andhra Pradesh: ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు

  • మూడ్రోజుల పాటు సమావేశాలు
  • ఈ నెల 20న బీఏసీ సమావేశంలో షెడ్యూల్ నిర్ణయం
  • జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై ప్రధానంగా చర్చించే అవకాశం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి మూడ్రోజుల పాటు జరగనున్నాయి. జనవరి 20, 21, 22 తేదీల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎంతో కీలకమైన సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు సహా ఇంగ్లీషు మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇక సమావేశాలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సందేశాలు వెళ్లాయి. ఈ నెల 20న బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈసారి సమావేశాల్లో జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. అటు, రాజధాని రైతుల భవితవ్యాన్ని తేల్చుతుందని భావిస్తున్న సీఆర్డీఏ చట్టంపైనా ఆసక్తికర చర్చ సాగుతుందని భావిస్తున్నారు.

More Telugu News