Sankranti 2020 sambralu: వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు: మంత్రి అవంతి శ్రీనివాస్

  • మధురవాడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మంత్రి
  • సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు  
  • చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే విపక్షాలను రెచ్చగొడుతున్నారు

వెనక బడ్డ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధితో ముందుకు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లాలోని మధురవాడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు. బొమ్మల కొలువు, పులివేషాలు, తప్పెటగుళ్ళు, డప్పు వాయిద్యాలు, హరిదాసుల సంకీర్తనలతో శిల్పారామం ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎనిమిది నెలల పాలనలో సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మరోవైపు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆయననే అనుసరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మవద్దని అవంతి సూచించారు. అవసరంమేరకు వాడుకుని వదిలేసే నైజం చంద్రబాబుదంటూ.. పవన్ కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని చెప్పారు.

More Telugu News