Saree Run: హైదరాబాదులో ఆకట్టుకున్న శారీ రన్

  • చీరకట్టుతో పరుగులో పాల్గొన్న మహిళలు, బాలికలు
  • పరుగును ప్రారంభించిన నటుడు మిలింద్ సోమన్
  • మహిళల్లో ఫిట్ నెస్ పెంచడానికే కార్యక్రమమన్న నటుడు

హైదరాబాద్ లో సరికొత్తగా శారీ రన్ నిర్వహించారు. ఈ పరుగులో ప్రత్యేకత ఏమిటంటే.. మహిళలు, బాలికలు చీరలు ధరించి పాల్గొనటం. మహిళల్లో ఫిట్ నెస్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరుగును నిర్వహించారు. నిన్న జరిగిన ఈ పరుగును నటుడు, మోడల్ అల్ట్రామ్యాన్ మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించారు. కాగా, ఈ పరుగులో మహిళలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. తనైరా, పింకథాన్ మూడో ఎడిషన్లో భాగంగా జలవిహార్ నుంచి సంజీవయ్య పార్క్ మీదుగా తిరిగి జలవిహార్ వరకు ఈ పరుగు సాగింది. వందలాది మంది మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీలో భాగంగా జుంబా సెషన్, కర్రసాము, వ్యాయామం చేస్తూ మహిళలు ముందుకు సాగారు. చీరకట్టుతో శారీ రన్ లో పాల్గొనటం తమకు ఆనందాన్ని కలిగించిందని మహిళలు వెల్లడించారు. మహిళలు ర్యాలీ సందర్భంగా డోంట్ హోల్డ్ బ్యాక్ అన్న నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా నటుడు మిలింద్ సోమన్ మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో ఆరోగ్యాన్ని, శారీరక పటుత్వాన్ని పెంచడానికే ఈ రన్ ను చేపట్టామన్నారు. భారతీయ మహిళకు చీరతో విడదీయరాని సంబంధముందన్నారు.

More Telugu News