Kalyan Ram: ముందుగా అనుకున్న టైటిల్ ఇది కాదు: హీరో కల్యాణ్ రామ్

  • కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్న 
  • ముందుగా అనుకున్న టైటిల్ 'ఆల్ ఈజ్ వెల్'
  • అందరికీ నచ్చుతుందన్న కల్యాణ్ రామ్  

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్నకి మంచి పేరుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎంత మంచివాడవురా' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గర పడటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో హీరో ఏదీ నెగెటివ్ గా తీసుకోడు. తాను పాజిటివ్ గా ఆలోచిస్తాడు .. మిగతావారిని అలాగే మార్చడానికి ట్రై చేస్తాడు. సతీశ్ వేగేశ్నగారి కథ .. మాటలు ఈ సినిమాకి బలం.

ముందుగా ఈ సినిమాకి ఆయన 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ ను పెట్టాలనుకున్నారు. తెలుగుదనం నిండిన టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేయడంతో 'ఎంత మంచివాడవురా' టైటిల్ ను సెట్ చేశారు. ఈ తరహా కథను నేను చేస్తున్నట్టు చెప్పినప్పుడు ఎన్టీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ కథ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News