Amaravati: రాజధాని విషయంలో సీపీఐలో విభేదాలు.. రామకృష్ణ ఇటు...కర్నూలు నేతలు అటు!

  • అమరావతిలోనే కొనసాగించాలంటున్న రామకృష్ణ 
  • అధికార వికేంద్రీకరణ ముద్దని కర్నూల్ నేతల తీర్మానం 
  • చంద్రబాబు తీరు పైనా విమర్శలు

రాజధాని అంశంపై బీజేపీలోనే కాదు సీపీఐలోనూ అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన అనంతరం దాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళనల్లో చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో కర్నూలు నేతలు అధికార పార్టీ మూడు రాజధానుల అంశానికి జై కొట్టడం సంచలనమైంది. ఈరోజు సమావేశమైన ఆ పార్టీ జిల్లా నేతలు అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడమేకాక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరును వ్యతిరేకించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా హెూదా కోసం విద్యార్ధులు ఉద్యమిస్తే కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిని తాత్కాలిక రాజధానిగా మార్చింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు.

More Telugu News