Regina: రెజీనా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

  • ఆ మధ్య వెనుకబడిన రెజీనా 
  • 'ఎవరు' హిట్ తో పుంజుకున్న కెరియర్ 
  • సెట్స్ పైకి వెళ్లిన ద్విభాషా చిత్రం

తెలుగు తెరపై అందం .. అభినయం కలగలిసిన కథానాయికలలో ఒకరుగా రెజీనా కనిపిస్తుంది. ఆ మధ్య రేసులో బాగా వెనుకబడినా, 'ఎవరు' సినిమా నుంచి ఆమెకి అవకాశాలు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా నాయిక ప్రాధాన్యత కలిగిన కథల్లో చేసే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా ఆమె మరో ప్రాజెక్టును అంగీకరించింది.

ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన 'నిను వీడని నీడని నేనే' సక్సెస్ ను సాధించింది. దాంతో ఈ సారి ఆయన నాయికా ప్రాధాన్యత కలిగిన కథను ఎంచుకుని రంగంలోకి దిగాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఈ రెండు భాషల్లో రెజీనా దశ తిరిగిపోతుందేమో చూడాలి.

More Telugu News