ఎమ్మెల్యే ద్వారంపూడి చర్యలు సిగ్గుచేటు : సీపీఐ రామకృష్ణ

13-01-2020 Mon 10:20
  • ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు హేయం
  • ప్రజా ప్రతినిధి రౌడీలా వ్యవహరిస్తే ఎలా?
  • చంద్రశేఖరరెడ్డిపై తక్షణం చర్యలు తీసుకోవాలి
కాకినాడ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీరు దారుణమని, జనసేన కార్యకర్తలపై దాడులకు పురిగొల్పడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ప్రజాప్రతినిధి అయివుండి బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి రౌడీలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఆయన ఎమ్మెల్యేనా, వీధి రౌడీనా అని రామకృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ సుపరిపాలన ఇదేనా? అని ప్రశ్నించారు. తక్షణం బాధ్యుడైన ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.