Jagan: జగన్ కేసులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తాజా వ్యాఖ్యలు... వీడియో ఇదిగో

  • 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఫర్వాలేదు
  • ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నదే న్యాయ వ్యవస్థ సిస్టం  
  • కోర్టు సాక్ష్యాలను పరిశీలించి నిర్ణయిస్తుందన్న లక్ష్మీ నారాయణ

జగన్ అక్రమాస్తుల కేసుల్లో న్యాయ పరమైన విచారణ జరుగుతోందని, ఈ కేసు ఏమవుతుందన్న విషయమై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పే పరిస్థితి లేదని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, ప్రస్తుతం జనసేన పార్టీ నేతగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తాజాగా, ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కోర్టులో ట్రయల్ అనంతరం, కోర్టు సాక్ష్యాలను పరిశీలించి, ఎవిడెన్స్ లేదని భావిస్తే వదిలేస్తుందని, సాక్ష్యం ఉందనుకుంటే తదుపరి చర్యలుంటాయని అన్నారు.

కోర్టుల్లో ఉన్న ఎన్నో కేసుల్లో ఇది కూడా ఒకటని, అన్ని కేసుల్లో మాదిరిగానే ప్రొసీజర్ ఉంటుందని అన్నారు. ఇక ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసింది మీరే కాబట్టి, అవన్నీ సక్రమమేనా అని ప్రశ్నించగా, "ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడేంటంటే, ఏవైతే చార్జెస్ ఉంటాయో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ను మనం కోర్టు వారికి ప్రొడ్యూస్ చేస్తాం. ఆ తరువాత ఏంటంటే, ట్రయల్ అన్నది ఒక ప్రాసెస్. ఎవరైతే మన ప్రాసిక్యూటర్స్ ఉన్నారో, వారు... మనం కోర్టుకు ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో... వాటిని కోర్టు ముందు వాదించాలి. ఆ తరువాత ప్రతి వాదనలు కూడా జరుగుతాయి. ఆ తరువాత ఫైనల్ గా యాజ్ ఏ జడ్జ్ వాళ్లు నిర్ణయం తీసుకుంటారు" అని అన్నారు.

"వెదర్ క్రైమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నది మన న్యాయ చట్టం. ప్రతిదీ ఏ మాత్రం సందేహం లేకుండా దాన్ని సిద్ధం చేయగలగాలన్నది మన న్యాయ వ్యవస్థ సిస్టమ్. వీటన్నింటినీ పరిశీలించిన తరువాత కోర్టువారు ఫైనల్ గా దే విల్ టేక్ ఏ డెసిషన్" అని చెప్పారు. తాను ఒపీనియన్ ఇవ్వడం లేదని, విధానాల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ, ఒక్క నేరం చేయనివాడికి శిక్ష పడకూడదన్నది మన న్యాయ వ్యవస్థలో ఉన్న సిస్టమ్ అని గుర్తు చేశారు. ఈ కోర్టు కాకుంటే, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంటాయని అన్నారు. వీవీ లక్ష్మీ నారాయణ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News