Amaravati: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు.. రాజధాని ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే?

  • రాజధాని ప్రాంతాన్ని ఎన్నికల నుంచి మినహాయించండి
  • రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించండి
  • ఈసీకి లేఖ రాసిన పంచాయతీరాజ్ శాఖ సీఎస్ ద్వివేది

రాజధాని తరలింపుపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఎన్నికలను మినహాయించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది.

ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లేఖ రాశారు. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించాలని, ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా యర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి  మున్సిపాలిటీలోను, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలోనూ కలపాలన్నారు. మిగిలిన గ్రామాలు అన్నింటినీ కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ద్వివేది ఆ లేఖలో కోరారు.

More Telugu News