Tirumala: తిరుమలలో తగ్గిపోయిన రద్దీ... రెండు గంటల్లోనే దర్శనం!

  • వెలవెలబోతున్న ఏడుకొండలు 
  • సంక్రాంతి వరకు సాధారణ రద్దీనే  
  • రేపటితో ధనుర్మాసం పూర్తి

ఏడు కొండలూ వెలవెలబోతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ నామమాత్రంగానైనా లేదు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లిన భక్తులు, కంపార్టుమెంట్లలో కూర్చోకుండానే నేరుగా దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి. క్యూలైన్ లోకి ప్రవేశిస్తే, గరిష్ఠంగా రెండు గంటల్లోనే దర్శనం లభిస్తోంది.

కాగా, రేపటితో ధనుర్మాసం పూర్తి కానుండటంతో, తిరుప్పావై సేవల స్థానంలో, ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండగ వరకూ సాధారణ రద్దీ మాత్రమే ఉండవచ్చని, ఆపై రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News