జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ కు తుది అనుమతులు లభ్యం

12-01-2020 Sun 16:10
  • ఈ మార్గంలో 18 రకాల భద్రతా తనిఖీలు పూర్తి
  • విద్యుత్, అగ్నిమాపక తదితర తనిఖీలు చేసిన నిపుణులు
  • ‘క్లియరెన్స్’ ఇచ్చిన మెట్రో రైల్ భద్రత కమిషనర్ గార్గ్

హైదరాబాద్ లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ కు తుది అనుమతులు లభించాయి. ఈ మార్గంలో 18 రకాల భద్రతా తనిఖీలు పూర్తయ్యాయి. విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాక్స్ కు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల అనంతరం మెట్రో రైల్ భద్రత కమిషనర్ జేకేకే గార్గ్ క్లియరెన్స్ ఇచ్చారు.