చంద్రబాబు ఉచ్చులో ప్రజలు పడొద్దు: మంత్రి బొత్స

12-01-2020 Sun 14:50
  • అమరావతి పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడింది
  • లక్ష కోట్లతో అమరావతిని మాత్రమే ఎందుకు అభివృద్ధి చేయాలి?
  • రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకూడదా?

చంద్రబాబు ఉచ్చులో ప్రజలు పడొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. అమరావతి పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. లక్ష కోట్లతో అమరావతిని మాత్రమే ఎందుకు అభివృద్ధి చేయాలి? వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకూడదా? అని ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా ప్రభుత్వం అమలు చేస్తోందని, భావి తరాల సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయని, అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని, మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా బురదజల్లేందుకు ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.