మూడు రాజధానుల వెనుక ఆంతర్యమేంటీ?: డి.రాజా

12-01-2020 Sun 13:20
  • ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నాం
  • రాజధానిగా అమరావతి కొనసాగాలి 
  • మూడు రాజధానుల యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక ఉన్న ఆంతర్యమేంటీ? అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. చాలా రాష్ట్రాల్లో ఒకే రాజధాని ఉందని, హైకోర్టులు ఇతర చోట్ల ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

రాజధానిగా అమరావతి కొనసాగాలని డి.రాజా డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను మొదటి నుంచి కోరుతున్నానని చెప్పారు. మూడు రాజధానుల యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ పాలనలోని వైఫల్యాలపై కూడా తాము పోరాడతామని డి.రాజా ఈ సందర్భంగా తెలిపారు.