మోదీతో వేదికను పంచుకోని మమతాబెనర్జీ

12-01-2020 Sun 12:56
  • కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాలకు మోదీ, మమతకు ఆహ్వానం
  • పశ్చిమ బెంగాల్‌లో మోదీ పర్యటన
  • ఇటీవల మోదీ ప్రభుత్వంపై మమత తీవ్ర విమర్శలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఒకే వేదికపై కనపడనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మమతాబెనర్జీ కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె అక్కడకు రాలేదు. పోర్టు వార్షికోత్సవాలకు మోదీతో పాటు మమతాబెనర్జీని కూడా ఆహ్వానించారు.

కోల్‌కతా పోర్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చుతామని ఈ రోజు ఉదయం మోదీ ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై మమత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ హాజరైన కార్యక్రమానికి మమత రాలేదు.