special trains: సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు : రద్దీ దృష్ట్యా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే నిర్ణయం

  • సికింద్రాబాద్‌ - విశాఖ, విజయవాడ-విజయనగరం మధ్య
  • జనరల్‌ క్లాస్‌ కోచ్‌లతో ఎక్కువ రైళ్లు
  • నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన సర్వీసులు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రత్యేక సర్వీసులను నిన్న రాత్రి నుంచి ప్రారంభించింది. పండుగకు ఊరెళ్లే వారితో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. రైళ్లయితే కాలు కదపడానికి కూడా వీలు లేని విధంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి కొన్ని సర్వీసులు నడుపుతోంది. విజయవాడ-విజయనగరం రైళ్లన్నీ 12 జనరల్‌ క్లాస్‌ కోచ్‌లతో నడుస్తుండడం వల్ల సాధారణ ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తం. మరింత వెసులు బాటు అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ.

విజయవాడ–విజయనగరం(07184) జనసాధారణ్‌ స్పెషల్‌ ను నిన్న రాత్రి  ప్రారంభించింది. ఈ రైలు రాత్రి 9.10 గంటలకు బయల్దేరి ఈ రోజు తెల్లవారుజామున 5.20 గంటలకు దువ్వాడ చేరుకుంది. అక్కడ నుంచి 5.22 గంటలకు బయల్దేరి  ఉదయం 7.20 గంటలకు విజయనగరం చేరుకుంది. తిరిగి ఉదయం 7.45 గంటలకు బయల్దేరి 9.23 గంటలకు దువ్వాడకు, అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరింది. ఈ రైలు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈరోజు,  రేపు కూడా (12,13 తేదీలు) ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.

అలాగే, విశాఖపట్నం–సికింద్రాబాద్‌(08523) స్పెషల్‌ రైలు విశాఖపట్నంలో ఈనెల 12,19 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 13, 20 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలులో 1–సెకండ్‌ ఏసీ, 2– థర్డ్‌ ఏసీ, 6–స్లీపర్‌ క్లాస్, 4–జనరల్‌ సెకండ్‌ క్లాస్, 2–సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజి కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం స్టేషన్‌లలో ఆగుతుంది.

అలాగే, విశాఖపట్నం–విజయవాడ(08525) డబుల్‌ డెక్కర్‌ స్పెషల్‌ విశాఖలో ఈనెల 12,19 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో(08526) విజయవాడలో అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈరైలు 8 డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లతో నడుస్తుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్‌లలో ఆగుతుంది.

అలాగే,  విజయనగరం–రాజమండ్రి(07197) స్పెషల్‌ ఈనెల 14న ఉదయం 7.45 గంటలకు విజయనగరంలో బయల్దేరి ఉదయం 9.23గంటలకు దువ్వాడకు,  అక్కడ నుంచి 9.25 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. ఇదే రైలు  (07198)  రాజమండ్రిలో 17న  మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడకు, అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి  రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.

అలాగే, విజయనగరం–విజయవాడ(07187) రైలు విజయనగరంలో ఈనెల 17,18,19 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు బయల్దేరి రాత్రి 10.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో(07186) విజయవాడలో ఈనెల 18,19 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుతుంది. అక్కడ నుంచి 6.32 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు విజయనగరం చేరుకుంటుంది.  రానుపోను నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస స్టేషన్‌లలో ఆగుతుంది.


More Telugu News